Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Says I Married Rashmika Only After She Asked 100 Times
Advertisement
  • ‘కాఫీ విత్ కరణ్’ షోలో సందడి చేసిన విజయ్-రష్మిక జంట
  • రష్మిక ఏడాది పాటు వెంటపడితే ఓకే చెప్పానన్న విజయ్ 
  • సంతోషకరమైన వివాహానికి తన మంత్రం చెప్పిన విజయ్
  • షో మధ్యలో అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన విజయ్ దేవరకొండ
Advertisement
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తొలిసారిగా కలిసి ప్రముఖ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’లో సందడి చేశారు. ఈ ఫైనల్ సీజన్ రెండో ఎపిసోడ్‌లో పాల్గొన్న ఈ జంట, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తమ పెళ్లి ప్రపోజల్ వెనుక ఉన్న అసలు కథను వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

షోలో హోస్ట్ కరణ్ జోహార్ ‘మీకు ప్రపోజల్ ఎలా జరిగింది?’ అని అడగ్గా, రష్మిక సిగ్గుతో తలదించుకుంది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ, ‘‘మనం పెళ్లి చేసుకుందాం అని తనే నన్ను అడిగింది. నేను ఓకే చెప్పేలోపు సుమారు 100 సార్లు అడిగి ఉంటుంది’’ అని నవ్వుతూ చెప్పారు. విజయ్ మాటలకు కరణ్ ఆశ్చర్యపోగా, రష్మిక కలుగజేసుకుని ‘‘నేను ఏడాది పాటు అడుగుతూనే ఉన్నాను’’ అని అసలు విషయం బయటపెట్టారు. దానికి విజయ్ సరదాగా ‘‘నేనేం అంత చెడ్డవాడిని కాదు’’ అని చెప్పడంతో సెట్‌లో నవ్వులు పూశాయి.

ఇదే షోలో రాపిడ్ ఫైర్ సెక్షన్‌లో, ‘పుష్ప’ సహనటుడు అల్లు అర్జున్, ‘యానిమల్’ సహనటుడు రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరిని ఎంచుకుంటారని కరణ్ అడగ్గా, రష్మిక వెంటనే అల్లు అర్జున్ పేరు చెప్పారు. అలాగే, రష్మిక కాకుండా ఎవరితో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని విజయ్‌ను ప్రశ్నించగా, రష్మిక వెంటనే ‘ఎవరితోనూ లేదు’ అని జవాబిచ్చింది. దీనిపై విజయ్ స్పందిస్తూ, ‘‘సంతోషకరమైన వివాహానికి నా మంత్రం ఒక్కటే.. భార్య చెప్పిన దానికి ఎప్పుడూ ఓకే అనాలి’’ అని చమత్కరించారు.

షోలోని గేమింగ్ సెగ్మెంట్‌లో విజయ్.. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి కరణ్ తో మాట్లాడించడం మరో విశేషం. కొంతకాలంగా తమ రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, విజయ్-రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
Vijay Deverakonda
Rashmika Mandanna
Koffee with Karan
Vijay Rashmika Marriage
Karan Johar
Allu Arjun

More Telugu News